12-01-2026 12:00:00 AM
పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
విజేతలకు బహుమతులు అందజేత
ఉప్పల్, జనవరి 11 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మల్లాపూర్ డివిజన్ నాగలక్ష్మి నగర్ కాలనీలో వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ పాల్గొని గెలుపొందిన ఆడపడుచులకు నగదు బహుమతులను అందజేశారు. మహిళలకు కాలనీ వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో నాగలక్ష్మి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు పీజీ సుదర్శన్,హమాలీ శ్రీనివాస్, సీహెచ్.మల్లేష్, ఎం.రంగా రెడ్డి, ఎం.సాయి కృష్ణ,కాలనీ అధ్యక్షులు తోట నవీన్ గౌడ్,ఉపాధ్యక్షులు ఎం.మాధవ్ రెడ్డి, వీ.శివ కుమార్, ప్రధాన కార్యదర్శి సీ.కిశోర్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఏ.శ్రీధర్ బాబు,కోశాధికారి ఎస్.నరేందర్ రెడ్డి, కే.అరుణ్, స్థానిక మహిళలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.