calender_icon.png 12 January, 2026 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి యువత స్వామి వివేకానంద సందేశాన్ని అనుసరించాలి

12-01-2026 03:47:54 PM

మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న

ఘనంగా వివేకానంద స్వామి జయంతి వేడుకలు

తాండూరు,(విజయక్రాంతి): శ్రీ స్వామి వివేకానందుడు ఇచ్చిన సందేశాలను నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని దేశభక్తి పెంపొందించుకోవాలని వికారాబాద్ జిల్లా తాండూర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అన్నారు. సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పట్టణం నడిబొడ్డులో ఉన్న శాంత మహల్ చౌరస్తా వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వివేకానంద స్వామి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల లలో ఆమె పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చికాగోలో జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానందునికి కేవలం రెండు నిమిషాలు మాత్రమే నిర్వాహకులు సమయం ఇచ్చారని.. ఆయన వేదిక పైకెక్కి సభికులను ఉద్దేశిస్తూ "సోదర సోదరీమణులారా" అని సంబోధించడంతో అక్కడున్న సభ్యులు అంతా చప్పట్లతో స్వామి వివేకానందను అభినందించిన ఘటన ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఘనతను ఆయన చాటి చెప్పారని గుర్తు చేశారు.. చిన్నారులు వేసుకున్న స్వామి వివేకానంద వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంకా ఈ కార్యక్రమం లో పలువురు విద్యావేత్తలు, యువతీ యువకులు భారీగా పాల్గొన్నారు.