23 June, 2026 | 2:46 AM

బోథ్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్

23-06-2026 01:38 AM

తాంసి/భీంపూర్, జూన్ 22 (విజయక్రాంతి): మండలంలోని కామట్ వాడ గ్రామ సర్పంచ్ మడావి మాధవ్, ఉప సర్పంచ్ గోవింద్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు, యువకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్‌ఎస్ లో చేరారు.

సోమవారం నేరడిగోండలోని ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోథ్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన అనంతరం నియోజకవర్గంలో జాతీయ పార్టీలు ఖాళీ దిశగా నాయకులు బీఆర్‌ఎస్ బాటలు పడుతున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి కేవలం బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని, వచ్చేది ముమ్మాటికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు.

అంతకుముందు పార్టీలో చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న పంచాయతీలకు లాభం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఉపయోగం లేదని స్పష్టంగా అర్థం చేసుకొని ఈరోజు బీఆర్‌ఎస్ పార్టీలో చేరామన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సీనియర్ నాయకులు కేమ శ్రీకాంత్, మాజీ ఎంపీపీ రత్నప్రభ సంతోష్, మాజీ సర్పంచ్ లింబాజి, రమణ రెడ్డి, నరేష్,దినేష్, తదితరులు ఉన్నారు.