calender_icon.png 26 July, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

25-07-2025 07:08:27 PM

ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం, పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ అన్నారు. డోర్నకల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమాల్లో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డు ధృవపత్రాలను అందజేశారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి 10 సంవత్సరాలు అధికారం అప్పగిస్తే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేక పోయిందన్నారు.

అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, భూకబ్జాలు, ప్రాజెక్టుల పేరుతో డబ్బులు దండుకొని ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందుల పాలు చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ విధ్వంసకర పాలనకు విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికార అప్పగిస్తే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సంక్షేమమే పరమావధిగా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలుపుతోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై అసత్య ప్రచారాలతో  ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని బీ ఆర్ ఎస్ చూస్తోందని, స్థానిక ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఫామ్ హౌస్ పార్టీకి గుణపాఠం నేర్పేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్ రామచందృ నాయక్ పేర్కొన్నారు.