calender_icon.png 27 December, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందుండి సమస్యలను పరిష్కరిస్తాం

27-12-2025 08:31:50 PM

గోపాలపేట సమస్యల పరిష్కారం ప్రారంభం

మురుగు కాలువల పని చేపట్టిన సర్పంచ్ కర్రోళ్ల  స్వప్న 

గోపాలపేట: ప్రజలకు చెరువలో ఉండి ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా ముందుండి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని గోపాలపేట సర్పంచ్ కర్రోళ్ల స్వప్న అన్నారు. శనివారం గోపాలపేట మండల కేంద్రంలోని 4వ వార్డు 6'7 వార్డులలో కాలనీ ప్రజలకు ఇబ్బందులు పెడుతున్న సమస్యలను పరిష్కరించేందుకు మొట్టమొదటిగా ముందడుగు వేశారు. ఆ కాలనీలలో ముండ్ల చెట్లు గురువు కాలువలను శుభ్రం చేయించారు.

వారి సొంత ఖర్చుతో పనులు చేపట్టడం గమనార్హం. గ్రామంలో గ్రామ పంచాయతీ నిధులతోనే కాలనీల సమస్యలను పరిష్కరించాలి కానీ గ్రామపంచాయతీని పక్కన పెట్టి కర్రోళ్ల స్వప్న నూతన సర్పంచ్ వారి సొంత డబ్బుతోనే యంత్రాలను జెసిబిలను లేబర్ను తీసుకొచ్చి తానే దగ్గరుండి సమస్యలను పరిష్కరించడం పట్ల ఆ కాలనీ ప్రజలు హౌరా అన్నట్టుగా పనులను చకచగా చేయించారు. ఈ ఐదేళ్లపాటు గోపాల్పేట మండల కేంద్రానికి చెందిన 14 కాలనీలలో ఏ సమస్య వచ్చినా తను ముందుండి సమస్యలను పరిష్కరిస్తే ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తారా అన్నట్టుగా అందుబాటులో ఉండి ప్రజలను చూసుకుంటే బాగుంటుందని ప్రజలు వాపోతున్నారు.