calender_icon.png 20 December, 2025 | 4:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో అంకితభావంతో పనిచేసినప్పుడే సర్పంచులకు గుర్తింపు

20-12-2025 03:22:11 PM

బిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి తునికి సాయిల్ గౌడ్

తుంగతుర్తి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అంకితభావంతో పనిచేసినప్పుడే గ్రామాల్లో గుర్తింపు లభిస్తుందని బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి తునికి సాయిలు గౌడ్ అన్నారు. శనివారం ఆయన నివాసంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం వెంపటిలో సర్పంచ్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన తునికి సాయిలు గౌడ్ ను స్థానిక సర్పంచ్ వార్డ్ మెంబర్లు శాలువాతో సన్మానించారు

. ఈ కార్యక్రమంలో వెంపటి సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, వివిధ వార్డు మెంబర్లు గుండగాని అనిల్, పుల్లూరి సాయమ్మ, దాసరి మంజుల, దేశబోయిన కేతమ్మ, మాజీ సర్పంచ్ కొండగడుపుల నాగయ్య, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు దేశబోయిన హరీష్ యాదవ్, బీఆర్ఎస్ మహిళా మండల అధ్యక్షురాలు తునికి లక్ష్మమ్మ, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు రచ్చ నవీన్, జక్కి సతీష్ గౌడ్, గుండగాని ఉదయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.