20-12-2025 03:30:33 PM
మౌలానా సయ్యద్ ఆలే ముస్తఫా ఖాద్రీ
భూత్‌పూర్ : హజ్రత్ సయ్యద్ కాజిమ్ పాషా ఖాదిరీ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహి జ్ఞాపకార్థంగా నెలవారీ ఫాతిహా, జిక్ర్ మహఫిల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హజ్రత్ సయ్యద్ ఆలే ముస్తఫా ఖాద్రి పాల్గొని ధార్మిక సందేశం ఇచ్చారు. అల్లాహ్ జిక్ర్ మన హృదయాలకు శాంతి, సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. అల్లాహ్ తాలా మానవాళి హిదాయత్ కోసం నబీల పరంపరను ప్రారంభించారని, మొత్తం 1 లక్ష 24 వేల మంది ప్రవక్తలను పంపారని వివరించారు. ప్రవక్తలు మనుష్యులను అల్లాహ్‌కు దగ్గర చేయడం, వారి లోక, పరలోక జీవితాలను సుసంపన్నం చేయడమే లక్ష్యంగా పనిచేశారని చెప్పారు. అలాగే పీరానీ పీర్ ఘౌస్-ఉల్-ఆజమ్ షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (రహ్), ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ అజ్మీరీ (రహ్) వంటి మహనీయులు తమ జీవితాలను మానవాళి సేవకే అంకితం చేశారని అన్నారు. ప్రతి ముస్లిం ఐదు సమయాల నమాజ్‌లను క్రమంగాపాటించాలని సూచించారు.
అంతకుముందు ఈ కార్యక్రమం ఖురాన్ పఠనంతో ప్రారంభమై, నాత్-ఎ-రసూల్‌తో (భక్తి గీతాలు)తో కొనసాగింది. ఈ కార్యక్రమం అంజమనే బజ్మే ఖాద్రియ కాజ్మియా జిల్లా అధ్యక్షులు జహంగీర్ పాష ఖాద్రీ ఆధ్వర్యంలో మహమ్మద్ అసద్ ఖాద్రీ మరియు మహమ్మద్ జమీర్ ఖాద్రీ తరపున జరగగా కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షులు బాబా షర్పోద్దీన్, కార్యదర్శి మహ్మద్ అహ్మద్, ఉపాధ్యక్షులు మహ్మద్ ఖాసిం ఖురేషి, మహ్మద్ జహంగీర్, సహాయ కార్యదర్శి మహ్మద్ నయీమ్, సయ్యద్ అబ్దుల్ ఖుద్దూస్, అంజుమనే బజ్మె ఖాద్రియా కాజ్మియా భూత్పూర్ సభ్యులు మహ్మద్ ఇబ్రాహీం, మహ్మద్ షబ్బీర్, మహ్మద్ రహీం ఖాద్రీ, మహ్మద్ అఖ్తర్ ఖాద్రి, మహ్మద్ అసద్ ఖాద్రీ, మహ్మద్ అలీం ఖాద్రీ, రహిమత్ పాష భాద్రీ, అబ్దుల్ తాహెర్ ఖాద్రీ, అబ్దుల్ ఖాదర్ ఖాద్రీ, జమీర్ ఖాద్రీ, యూనుస్ ఖాద్రీ, ముహమ్మద్ ఖాన్ ఖాద్రీ, సుల్తాన్ పాష ఖాద్రీ, చాంద్ బాబా ఖాద్రీ, మహ్మద్ అంజద్ ఖాద్రీ, రెహ్మాన్ ఖాద్రి, మహమ్మద్ అబ్దుల్ సాదిఖ్, వాహెద్ అలి, సాబేర్, అన్వరుల్లా, మసూద్ , అహ్మద్ అలి, మత పెద్దలు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు