20-12-2025 04:08:45 PM
హైదరాబాద్: నల్లకుంట(Nallakunta) పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అగ్నిప్రమాదం(Fire accident) జరిగింది. నల్లకుంట వడ్డెరబస్తీలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మంటల ధాటికి భారీగా పొగలు కమ్మేయడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. మొదటి అంతస్తులో ఉన్న ఏడుగురిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.