20-12-2025 03:19:50 PM
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లి నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, చంద్రకుమార్ గౌడ్, వినోద్ కుమార్, ప్రవీణ్ టెన్నీ, అజ్మాత్, రాములు యాదవ్ఇతర పెద్దలు పాల్గొన్నారు.