20-12-2025 04:31:39 PM
- విస్తరణ పనులు తగ్గించాలని ఆందోళన
- కూల్చివేతలు చేపట్టిన అధికారులు
- పోలీసు బందోబస్తు మధ్య రోడ్డు పనులు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శిశుమందిర్ రోడ్డు వెడల్పు పనులు ప్రారంభమయ్యాయి. పోలీసుల పహరా మధ్య రోడ్డు విస్తరణ పనులను శనివారం మున్సిపల్ అధికారులు చేపట్టారు. 60 ఫీట్ల వెడల్పుతో చేపట్టిన రోడ్డు వెడల్పు పనులను నిర్వాసితులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వ్యాపారుల నిరసనల మధ్యనే అధికారులు వెడల్పు పనులను చేపట్టారు. వ్యాపారులు ఎంత అభ్యంతరం చెప్పినా అధికారులు తమపై తాము చేసుకుంటూ పోయారు.
దీంతో వ్యాపారులు జేసీబీ యంత్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రోడ్డు విస్తరణ పనులను 40 ఫిట్లకు కుదించాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ తో వాదించారు. అందుకు ఆయన ససేమీరా అన్నారు. ప్రకటించి ప్రకారం రోడ్డు విస్తరణ పనులను 60 ఫీట్లకు తగ్గకుండా చేపడతామని ఖరాకండిగా చెప్పారు. వ్యాపారులు 40ఫిట్స్ తో చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణ పనులను తగ్గించడం తన పరిధిలో లేదని కమిషనర్ రమేష్ తేల్చి చెప్పారు. 24 గంటలు (ఒకరోజు టైమిస్తున్న రోడ్డు విస్తరణ పనులకి సహకరించాలని వ్యాపారులకు ఆయన నచ్చచెప్పారు.
మీరులానే అడ్డుకుంటే రేపటినుంచి పోలీసు బందోబస్తు మధ్య రోడ్డు విస్తరణ పనులను పూర్తిస్థాయిలో చేపడుతామని స్పష్టం చేశారు. దీంతో వ్యాపారులు చేసేదేమీలేక ఆందోళను విరమించారు. అప్పటికే అధికారులు శిశుమందిర్ పాఠశాల ప్రహరీ గోడ ను కూల్చివేశారు. రోడ్డు విస్తరణ పనును సవ్యంగా జరిగేందుకు బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు, తాండూర్ సీఐ దేవయ్య, బెల్లంపల్లి రూరల్ సీఐ హనోక్, బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ సిహెచ్ కిరణ్ కుమార్, ఎస్సైలు, పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు.