20-12-2025 03:33:33 PM
మర్రిగూడ,(విజయక్రాంతి): మర్రిగూడ మండలంలోని యరగండ్లపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పుప్పాల యాదయ్య(TDP leader Puppala Yadiah) మాతృమూర్తి లక్ష్మమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి దహన సంస్కారాల కొరకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. లక్ష్మమ్మ మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సానుభూతి వ్యక్తపరచిన ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.ఆయన వెంట ఉపసర్పంచ్ చామకూర కిష్టమ్మ,వార్డు సభ్యులు, అందుగుల శ్రీనివాస్, ఐత గొని రాములు, డాలి సుమలత వరుణ్, సీనియర్ నాయకులు వనపర్తి నరసింహ, శంకర్, కట్ట యాదయ్య, ముండ్ల వెంకటేష్, సీత నరసింహ,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.