calender_icon.png 20 December, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లెక్సీలతో కడియం శ్రీహరికి వినూత్న నిరసన

20-12-2025 03:54:31 PM

స్టేషన్ ఘనపూర్‌లో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ 

హైదరాబాద్: స్టేషన్ ఘనపూర్‌ నియోజకవర్గంలో(Ghanpur Station constituency) శనివారం ఉద్రిక్తత నెలకొంది. దీంతో బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి స్వాగతం అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ నేతలు స్టేషన్ ఘన్ పూర్ లో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది, పోలీసులు ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ సిబ్బంది, పోలీసులను బీఆర్ఎస్ నేతలు అండుకున్నారు. ఘర్షనకు దిగిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఫ్లెక్సీలతో కడియం శ్రీహరికి వినూత్న నిరసన సెగ తగిలింది. తిరుమల దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ శ్రీకారానికి వస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరికి(MLA Kadiyam Srihari) స్వాగతం సుస్వాగతం అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ శ్రేణుల వినూత్న నిరసన చేశారు. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు స్పీకర్‌కు లిఖిత పూర్వకంగా కడియం శ్రీహరి ఇవ్వడంతో ఓ వైపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఫోటోలతో  బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఫ్లెక్సీ పంచాయతీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.