20-12-2025 03:26:38 PM
మున్సిపల్ అధికారులను ప్రశ్నించిన బిజెపి నాయకులు
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ అద్వానంగా తయారైందని మేజర్ గ్రామపంచాయతీ నుంచి ము మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి పట్టణంలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా పట్టణంలోని ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు ఆవేదన వెలిబుచ్చారు. ఈ మేరకు శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆ పార్టీ తరపున అధికారులకు విన్నవించారు. ఇప్పటికీ రెండు పాలకవర్గాలు కాలం అయిపోయినప్పటికీ స్థానిక నాయకులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలోకి జంపు జిలానిలుగా మారుతున్నారు తప్ప ఏ ఒక్క నాయకుడు స్థానిక అభివృద్ధి పట్టించుకున్న పాపాన పోలేదని వారు ప్రశ్నించారు. పట్టణ అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు వాపోయారు. ఇటీవల కాలంలో అభివృద్ధి కోసం రూ 15 కోట్లు వచ్చాయని చెప్పినా అధికారులు నాయకులు ఒక్క పైసా రాక పట్టణంలోని ప్రధాన రహదారి, అంతర్గత రోడ్లు మరమ్మతులు చేయకపోగా, అధ్వానంగా తయారై దుమ్ము, ధూళి, కోతులు, పందులు, కుక్కలు, పశువు,ల తో ప్రజలు సహవాసం చేయాల్సి వస్తుందని వారు తీవ్ర మనోవేదన వెల్లడించారు.
మున్సిపాలిటీ నుంచి ఎటువంటి అభివృద్ధి లేకపోగా ఇంటి పన్ను ఇతర పన్నులు బలవంతంగా వసూలు చేస్తూ లేకపోతే ఇంటికి తాళాలు వేస్తామని బెదిరిస్తూ అధికారులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నారని వారు ఆరోపించారు .పట్టణంలో వందల సంఖ్యలో కోతుల గుంపులు తిరుగుతుండగా వాటికి భయపడి ఎంతోమంది మృత్యువాత పడ్డ కూడా అధికారులు నాయకులు చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మురికి కాలువల పరిస్థితి మరింత దారుణంగా ఉండి దోమలతో సహజీవనం చేయాల్సి వస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు కీర్తి మనోజ్ కుమార్ ,పార్టీ మండల అధ్యక్షులు పుప్పాల ఉపేందర్, పట్టణ ఉపాధ్యక్షులు జట్టి సురేందర్, మాదాసు మురళి, ఆసం సాయి, పిట్టల భూమన్న, పోల్సాని అనిల్ రావు ,సందుపట్ల శ్రావణ్, రాపల్లి రవీందర్, గోదాపురం సందీప్, అడిదేల మహేష్ ,కాలేరి రాజేందర్, మేకల నరసయ్య, రేండ్ల శంకర్, తదితరులు ఉన్నారు.