calender_icon.png 30 December, 2025 | 8:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ: సర్పంచ్ కోడప శంకర్

30-12-2025 06:43:58 PM

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మొగవెల్లి గ్రామపంచాయతీ దొడ్డిగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్ కడప శంకర్ భూమి పూజ చేశారు.శిడం సురేఖ శంకర్ ఇంటి నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మొగవెల్లి సర్పంచ్ కోడప శంకర్ మాట్లాడుతూ... పేదోడి సొంతింటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కట్టుబడి ఉంటామని అన్నారు. అలాగే విడతలవారీగా ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన అందరికీ కూడా ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆలం సీతారాం, పంచాయతీ కార్యదర్శి రాజేశ్వర్, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.