05-10-2025 05:19:23 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): జాతీయ ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా సుల్తానాబాద్ కు చెందిన బొల్లి సత్యనారాయణ అవార్డు అందుకున్నారు. ఆదివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాగేశ్వరి డిగ్రీ, పీజీ కళాశాలలో నిర్వహించిన గురుస్ స్టూడెంట్స్, పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడాకారులను తయారు చేస్తూ విశిష్ట సేవలు అందించిన సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు బొల్లి సత్యనారాయణను గురుస్ స్టూడెంట్స్, పేరెంట్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇండియా చైర్మన్, జాతీయ అధ్యక్షుడు గంగారపు మల్లేశంతో పాటు సంస్థ ప్రతినిధులు, ఉత్తమ ఉపాధ్యాయుడుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందించి ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గురుస్ సంస్థ ప్రతినిధులకు బొల్లి సత్యనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.