05-10-2025 05:15:03 PM
నిర్మల్ (విజయక్రాంతి): వైద్య రంగంలో సేవ భావం అవసరమని రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలో మిత్ర డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించారు. వైద్య రంగంలో విప్లవాతకమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకురావాలని సూచించారు. నిర్మల్ జిల్లా ఏర్పడ్డ తర్వాత ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నిర్వాహకులు నేరెళ్ల హనుమంతు ప్రదీప్ ఇతరులు పాల్గొన్నారు.