03-09-2025 07:39:38 PM
సిద్దిపేట రూరల్: భీమవరం టాకీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ప్రొడక్షన్ నెం.125 “సావాసం” సినిమా రెగ్యులర్ షూటింగ్ ఘనంగా ప్రారంభమైంది. స్వయంభు శ్రీ బుగరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చిత్రబృందం క్లాప్‌తో షూటింగ్ మొదలైంది. ఈ సందర్భంగా సినిమా నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ, దర్శకుడు ఏకారి సత్యనారాయణ, రచయిత పడిగే గణేష్‌తో పాటు మూవీ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన తొలి షెడ్యూల్ విజయవంతంగా ముగిసిందని చిత్రబృందం తెలిపింది. “ప్రేక్షకులకు వినూత్నమైన అనుభూతిని అందించేలా సావాసం సినిమాను రూపొందిస్తున్నాం. కుటుంబమంతా కలిసి చూసే చిత్రంగా ఇది నిలుస్తుంది” అని నిర్మాత సత్యనారాయణ తెలిపారు.