03-09-2025 07:41:38 PM
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం
మునుగోడు,(విజయక్రాంతి): దేశం సంపదకు సృష్టికి దోహదపడే రైతులను కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొచ్చి రైతులను మోసం చేస్తున్న విధానాల పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాలు ఉద్యమాలకు సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గురజా రామచంద్రం అన్నారు.సంయుక్త కిసాన్ మోర్చా, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం, దేశవ్యాపిత పిలుపులో భాగంగా మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మునుగోడు తాసిల్దార్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు.
పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ పత్తి కనీసం మద్దతు ధర (ఎమ్. ఎస్. పి) క్వింటాలుకు10.0 75.కి. పెంచడం,పూర్తి రుణమాఫీ, రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు 25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.పత్తిని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 19 పత్తిపై 11% దిగుమతి సుంకాన్ని తొలగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ఫలితంగా దేశ రైతుల ఖర్చులతో పత్తిని దిగుమతి చేసుకోవడానికి 0% సుంకం విధించబడుతుంది అని అన్నారు.
ఈ విధాన తిరుగమనం కేంద్ర ప్రభుత్వ దొల్లతనం అని వారన్నారు.రాబోవు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అన్ని సంఘాల కూడగట్టుకుని రైతులకు అన్ని విధాలుగా అండదండగా ఉంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను,బండమీది యాదయ్య,బి లాలు, దుబ్బ వెంకన్న,కురుమర్తి ముత్తయ్య,రాంబాబు, సత్తిరెడ్డి, నర్సిరెడ్డి ఉన్నారు.