03-09-2025 07:38:19 PM
మొగలాయికోట మాజీ సర్పంచ్ లింగా రాఘవరెడ్డి
అనంతగిరి: ఉన్నత ఆశయంతో నిర్మించతలపెట్టిన రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకంతో ఎంతోమంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిలకు రైతుల పక్షాన మొగలాయికోట మాజీ సర్పంచ్ లింగ రాఘవరెడ్డి ఓ ప్రకటన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. 54 కోట్ల వ్యయంతో మంగళవారం రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకం శంకుస్థాపనతో అనంతగిరి మండల అన్నదాతల కలల సహకారం అవుతున్నందుకు హర్షం వ్యక్తం చేస్తు, సంబురాలు చేసుకుంటున్నారనీ అన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంకల్పం,కృషిని అన్ని వర్గాలు పొగుడుతున్నాయనీ, సంతోషంతో ఉత్తమ్ దంపతులకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాజీవ్ శాంతి నగర్ లిప్ట్ ద్వారా అనంతగిరి మండలంలోని 7 గ్రామాలలో సుమారు 5000 ఎకరాలు, కోదాడ మండలంలోని 3 గ్రామాల పరిధిలో 1781 ఎకరాలు మొత్తం 5000 ఎకరాలు తీవ్రకరవు వచ్చిన పాలేరు వాగు నుండి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తీసుకురావడం వెనక స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కృషి ఎంతో ఉందని అన్నారు. రైతుల పక్షాన ఉత్తమ్ దంపతులు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమాలతో ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.
2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉత్తంకుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి శాంతినగర్ లిప్ట్ ని ప్రారంభించారన్నారు.గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వంలో పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయడం లేదనే నెపంతో నిర్వీర్యం చేసి రైతుల ఉసురు పోసుకుందన్నారు.రైతుల పక్షపాతి అపర భగీరధుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి అధికారం వచ్చిన వెంటనే సాగునీటి కష్టాలు తీర్చి రైతులు సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో రైతులు ఎన్నో ఏండ్లుగా పడుతున్న కష్టానికి రాజీవ్ శాంతినగర్ ఎత్తిపోతల పథకంతో ఫలితం దక్కుతుందన్నారు.