20 April, 2026 | 7:14 PM

అంబేద్కర్ భవన్ స్థలాన్ని కాపాడండి

20-04-2026 06:06 PM

- బెల్లంపల్లి చైర్ పర్సన్ స్వాతికి దళిత సంఘాల ఐక్యవేదిక విన్నపం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి అంబేడ్కర్ ఫంక్షన్ హాల్ స్థలం ఆక్రమించి అక్రమంగా వ్యాపారం చేస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకోనీ,తక్షణమే ఖాళీ చేయించాలని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ కు వినతి పత్రం అందజేశారు.

అసంపూర్తిగా మధ్యలోనే ఆగి పోయిన అంబెడ్కర్ ఫంక్షన్ హాల్ ను పూర్తి చేయాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో దళిత సంఘాల ఐక్యవేదిక బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దళితరత్న కుంభాల రాజేష్, ప్రధాన కార్యదర్శి రత్నం ఐలయ్య, పట్టణ కోశాధికారి గొడిసెల శ్రీహరి, గౌరవ సలహాదారులు కామెరదుర్గయ్య, ముఖ్య సలహాదారులు దాసరి భానయ్య, బొంకురి రామచందర్, పట్టణ ఉపాద్యక్షులు సుంకిత సమ్మయ్య ఉన్నారు.