calender_icon.png 5 January, 2026 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జూర్ లో సావిత్రిబాయి పూలే జయంతి

03-01-2026 04:36:58 PM

బెజ్జూర్,(విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలే జయంతి ఘనంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే, జ్యోతిబాపూలే విగ్రహాలకు  కుల సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. సందర్భంగా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మండల అధ్యక్షుడు ఆదే అశోక్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోటమాలి కుల సంఘం నాయకులందరూ ఐక్యమత్యంతో సంఘం అభివృద్ధికి, ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండాలని సంగం ఐక్యతను చాటాలని వారు కోరారు. సావిత్రిబాయి పూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని అన్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోటమాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొట్రంగి రామకృష్ణ, యువజన మండల అధ్యక్షుడు కావిడి సురేష్, సర్పంచులు, ఉప సర్పంచ్లు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.