calender_icon.png 7 January, 2026 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195 జయంతి వేడుకలు

03-01-2026 04:34:55 PM

జాతీయ మాల మహానాడు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ

చేర్యాల: చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంగడి బజార్ లో భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు  సావిత్రిబాయి పూలే చిత్రపటానికి  పూలమాల వేసి జయంతి వేడుకలు చేశారు. ఈ కార్యక్రమంను ఉద్దేశించి  జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ మాట్లాడుతూ... సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3 న మహారాష్ట్రలోని సతార జిల్లా, ఖండాల తాలూకాలోని నయాగవ్ అనే చిన్న గ్రామంలో జన్మించారు.ఆమె 9 ఏళ్ల వయసులో 13 ఏళ్ల  వయసున్న జ్యోతిరావు పూలతో వివాహం ఐనది అని జ్యోతిరావు పూలే తన భార్యకు విద్య నేర్పితే  సమాజం మార్పు సాధ్యమని చదువు నేర్పారు.దేశంలోనే మొట్టమొదటి టీచరుగా ఆమె అర్హత పొందారు.బడుగు బలహీన వర్గాల స్త్రీలకే కాకుండా బ్రాహ్మణ స్త్రీలకు కూడా చదువు చెప్పారు.