02-08-2025 12:00:00 AM
పీసీసీ కార్యదర్శి రాంగోపాల్
నిర్మల్ ఆగస్టు 1(విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నందుకు ఏఐసీసీ నాయకురాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీనాక్షి నటరాజన్ జిల్లాలో జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ మాజీ మంత్రి ఏ ఇంద్రకన్ రెడ్డి డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు తెలిపారు శుక్ర వారం నిర్మల్ విశ్రాంతి పనులు ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 3న జన హిత పాదయాత్ర బాధలు గుర్తు నుం చి ఖానాపూర్ చేరుకొని నాలుగు తారీఖున ఖానాపూర్ నియోజకవర్గం లో
పాదయాత్ర ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇందులో వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. జనత పాద యాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అర్జుమత్ అలీ భీమరెడ్డి అబ్దుల్ ఆది ధర్మాజీ రాజేందర్ గండ్రత్ ఈశ్వర్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.