04-10-2025 05:30:22 PM
హైదరాబాద్: నగరంలో జంట జలాశయాల నుంచి మరోసారి భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో జంట జలాశయాల నుంచి నీటిని విడుదల చేసిన జలమండలి అధికారులు వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన మరోసారి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉండగా జలమండలి అధికారులు జంట జలాశయాలు సందర్శించి ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీటిని ఉస్మాన్ సాగర్ 3 గేట్లు, హిమాయత్ సాగర్ 2 గేట్లు ఎత్తి ముందస్తు జాగ్రత్తగా మూసీలోకి వదులుతున్నట్లు జల మండలి ఎండి అశోక్ రెడ్డి వెల్లడించారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అధికారులకు సూచించారు.