calender_icon.png 4 October, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటెక్ విద్యార్థినికి ల్యాప్‌టాప్‌ అందజేత

04-10-2025 04:47:27 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లెందు పట్టణంలోని ఓ బీటెక్ విద్యార్థినికి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్ సహకారంతో తిరుమల సేవా ఫౌండేషన్ ఫౌండర్ చల్ల తిరుమలరావు శనివారం ల్యాప్‌టాప్‌ ను అందజేశారు. ఖమ్మం సమీపంలోని పొన్నెకల్లులో గల శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇంజనీరింగ్ కాలేజీలో సీఎస్ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న బత్తుల సాధ్వికకు ల్యాప్‌టాప్‌ అవసరమని దిండిగల రాజేందర్ దృష్టికి తీసుకువెళ్లగా తిరుమల సేవా ఫౌండేషన్ వారితో మాట్లాడి ల్యాప్‌టాప్‌ ఇవ్వడం జరిగింది. ఆసక్తితో చదివి ఉన్నత స్థాయికి చేరాలని వారు ఆకాంక్షించారు. పెద విద్యార్థులకు తమ వంతు సాయం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల సేవా ఫౌండేషన్ చైర్మన్ రాజు, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సాయికుమార్, రామ్ లాల్ పాసి తదితరులు పాల్గొన్నారు.