04-10-2025 05:32:36 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం అన్నదాన సేవా సొసైటీ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా కేసముద్రం మండలంలోని వివిధ గ్రామాల అయ్యప్ప మాల ధారణ స్వాములకు మండల కాలం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నందుకు అన్నపూర్ణ పురస్కారాన్ని అందజేశారు. డాక్టర్ సుదగాని రాజు గౌడ్ ఆధ్వర్యంలోని హైదరాబాద్ ‘మహాశాస్త్ర సేవా ట్రస్ట్’ ఆధ్వర్యంలో కేరళ మాలికాపురత్తమ్మ మెయిల్ శాంతి మురళీ నంబూద్రి, మలయాళ తాంత్రిక పీఠాధిపతులు శివ నర్సింహన్ తాంత్రి చేతుల మీదుగా హైదరాబాదులోని చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నపూర్ణ పురస్కారం-2025 పురస్కారాన్ని అయ్యప్ప అన్నదాన సేవా సొసైటీ ప్రతినిధులకు అందజేశారు.
ఇదే కార్యక్రమంలో గురు స్వాములు కొత్తపల్లి శేఖర్, జనగాం వెంకట్ గౌడ్, రుద్ర శ్రీకాంత్ లకు గురు పురస్కారాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం అయ్యప్ప అన్నదాన సేవా సొసైటీ అధ్యక్షులు ఓలం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి పోలేపల్లి యాకూబ్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వర చారి, ఆలయ ధర్మకర్త చింతా నాగేశ్వరరావు గురు స్వామి, వాంకుడోతు బిచ్చ నాయక్, చింత సాయి పాల్గొన్నారు.