13 April, 2026 | 11:50 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

పాఠశాల అభివృద్ధికి ప్రాధ్యాన్యం ఇవ్వాలి

14-02-2026 12:00 AM

ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

అంబర్ పేట (ముషీరాబాద్) ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): పాఠశాలలో మౌలిక వసతులను మెరుగుపరిచి విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ పరిధిలోని ఆజంపూర (లంక) ప్రభుత్వ హైస్కూల్‌ను ఆయన సందర్శించి అక్కడ పరిస్థితులను ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నా రు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ రాబోయే విద్యా సం వత్సరంలో అడ్మిషన్లు పెరిగేలా ప్రత్యేక చర్య లు తీసుకోవాలని, పాఠశాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.