06-11-2025 05:03:29 PM
పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని కాటేపల్లి గ్రామంలో అర్హులందరికి రేషన్ కార్డులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ అన్నారు. ఆయన గురువారం కాటేపల్లి గ్రామంలోని రేషన్ షాప్ లో లబ్ధిదారులకు బియ్యంతో పాటు చేతి సంచుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా చాలామంది అర్హులకు రేషన్ కార్డులు లేవని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క కొత్త కార్డ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు దొడ్డు బియ్యం అందజేసేవారని అవి తినలేక చాలామంది అమ్ముకునే వారని తెలిపారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు సన్న బియ్యం అందజేస్తోందని తెలిపారు. ఈ బియ్యాన్ని లబ్ధిదారులు తృప్తిగా భుజిస్తున్నారని తెలిపారు.రేషన్ కార్డ్ ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ఆయన తెలిపారు.అన్నివర్గాల ప్రజలకు ఆమోదయోగ్య మైన పాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ అశోక్ పటేల్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మొహిద్దిన్ పటేల్, మొగలగౌడ్, పర్వయ్య,గంగా గౌడ్ ,కిషన్, షఫీ,భారత్యానాయెక్, రమేష్ దేశాయ్,గంగారాం, రాంచందర్, హాజీ ,బాల్ రాజ్, జేతి నాయక్,చందర్ తదితరులు పాల్గొన్నారు.