calender_icon.png 6 November, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే బాలు నాయక్ ఆధ్వర్యంలో నవీన్ యాదవ్‌కు విశ్వ బ్రాహ్మణులు సంపూర్ణ మద్దతు

06-11-2025 05:24:03 PM

దేవరకొండ (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ కి అఖండ మద్దతు లభించింది. రెహమత్ నగర్ డివిజన్, బూత్ నెంబర్ 111 పరిధిలోని విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ప్రచారంలో భాగంగా, రెహమత్ నగర్ డివిజన్ ఇంచార్జ్, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గురువారం బస్తీలోని విశ్వబ్రాహ్మణ ప్రముఖులు, సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ, "మీ బస్తీ వాస్తవ్యుడైన నవీన్ కుమార్ యాదవ్ మీ సమస్యలను అతి దగ్గరగా చూసిన వ్యక్తి. ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, ఆయన కేవలం ఎమ్మెల్యేగా కాక, మీ బస్తీ బిడ్డగా అనునిత్యం మీ వెంటే ఉండి, విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం, అలాగే బస్తీ అభివృద్ధికి అవసరమైన పూర్తి తోడ్పాటును అందిస్తారు" అని విశ్వబ్రాహ్మణ సంఘం కమిటీ వారిని ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. బాలు నాయక్ పిలుపు మేరకు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు తక్షణమే సానుకూలంగా స్పందించి, కాంగ్రెస్ పార్టికి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో బూత్ కోఆర్డినేటర్ దూదిపాల శ్రీధర్ రెడ్డి, కాసర్ల వెంకటేశ్వర్లు, యేకుల సురేష్, బచ్చన బోయిన శ్రీను, స్థానిక బూత్ ఇంచార్జులు సతీష్, సజ్జాద్ తదితరులు పాల్గొన్నారు.