06-11-2025 04:33:58 PM
నంగునూరు: రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన గట్లమల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని డి.అనును గురువారం గ్రామ యువకులు ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. క్రీడల్లో ప్రోత్సాహం అందించిన పిఈటీ, ఉపాధ్యాయ బృందానికి ఈ సందర్భంగా అను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. రానున్న పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి మూడు స్థానాల విద్యార్థులకు వరుసగా ఐదు, మూడు, రెండు తులాల వెండిని బహుకరిస్తామని యువకులు తెలిపారు. క్రీడారంగంతో పాటు విద్యారంగంలోనూ గ్రామ యువకులు పెద్దల సహకారంతో పాఠశాలను మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వీ గ్రామ శాఖ అధ్యక్షుడు రంగు చింటూ, యువకులు మహేందర్, కర్రీ సంపత్, రంగు టింకు పాల్గొన్నారు.