06-11-2025 05:17:02 PM
ఉత్సవాల రాష్ట్ర కో కన్వీనర్ నాగపురి రాజమౌళి గౌడ్..
హనుమకొండ (విజయక్రాంతి): వందేమాతరం 150 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకొని గురువారం హనుమకొండ హంటర్ రోడ్ లోని సత్యం కన్వెన్షన్ హాల్ లో హనుమకొండ బిజెపి జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి వందేమాతరం ఉత్సవాల రాష్ట్ర కోకన్వీనర్, ఉమ్మడి వరంగల్ జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు నాగపురి రాజమౌళి గౌడ్ హాజరై మాట్లాడారు. దేశవ్యాప్తంగా 150 కేంద్రాల్లో వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలు జరుగుతున్నాయని అందులో భాగంగా తెలంగాణలో ఐదు ప్రాంతాల్లో మహబూబ్నగర్, నిజామాబాద్, అదిలాబాద్, హైదరాబాద్,తో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండలో జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు కాళోజీ జంక్షన్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి,అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద సామూహికంగా వందేమాతరం జాతీయ గేయాన్ని ఆలపిస్తారన్నారు. ఇది మన జాతీయ గేయానికి గౌరవం తెలియజేసే మహత్తరమైన సందర్భం కావున ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా కోరారు. ఈ సమావేశంలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి, పరకాల బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కాళీ ప్రసాద్ , ఉమ్మడి వరంగల్ మాజీ జిల్లా అధ్యక్షులు దోంతి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారాయణ , వరంగల్ జిల్లా వందేమాతర ఉత్సవాల కన్వీనర్ బన్న ప్రభాకర్, హనుమకొండ జిల్లా వందేమాతర ఉత్సవాల కన్వీనర్ కొల్లూరు యోగానంద్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సండ్ర మధు, వరంగల్ బిజెపి జిల్లా కార్యదర్శి కూతూరు రాజు,తాటికొండ రవికిరణ్ మరియు ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.