calender_icon.png 6 November, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెబ్బైర్ అంజనేయ స్వామి ఆలయంలో భిక్షా కార్యక్రమం

06-11-2025 05:45:57 PM

ఘనంగా పాల్గొన్న శబరి గిరీశ మహా పాదయాత్ర సమితి గురుస్వాములు..

సనత్‌నగర్ (విజయక్రాంతి): శ్రద్ధా భక్తులతో నిండిన వాతావరణంలో పెబ్బైర్ అంజనేయ స్వామి దేవస్థానంలో నేడు మధ్యాహ్నం భిక్షా కార్యక్రమం విశిష్టంగా జరిగింది. అయ్యప్ప మాలధారణలో ఉన్న భక్తులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక భక్తులు పోలా వాసు, పోలా రాజేశ్వరి, పోలా వంశీ కృష్ణ, పోలా శిరీష, పోలా మోక్షిత, పోలా ఈశిత కుటుంబ సభ్యులతో ఈ రోజు భిక్ష కార్యక్రమానికి ప్రాయోజకులు పొలా వాసు కుటుంబం కలిసి శ్రద్ధాభక్తులతో నిర్వహించగా, స్వామివారి సేవలో పాల్గొనడం తమ భాగ్యం అని వారు పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి పాదయాత్రలో భాగంగా శ్రీ శబరి గిరీశ మహా పాదయాత్ర సమితి గురుస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా సోములు యాదవ్ గురుస్వామి, బాబు గురుస్వామి, బాలు యాదవ్ గురుస్వామి, నాగరాజు గురుస్వామి, దశరథ గురుస్వామి, బబులు గౌడ్ గురుస్వామి,నరసింహ గురుస్వామి,చింటూ గురుస్వామి,హరికృష్ణ గురుస్వామి, టి. నాగరాజ్ గురుస్వామి, రాజు యాదవ్ గురుస్వామి,వెంకట్ గురుస్వామి,చిన్న గురుస్వామి తదితరులు పాల్గొని భజనలు చేసి స్వామివారి కరుణాకటాక్షాలు కోరుకున్నారు. భిక్షా కార్యక్రమం అనంతరం గురుస్వాములకు సత్కారం నిర్వహించారు.

ఆలయ యాజమాన్యంతో పాటు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.పాదయాత్రలో పాల్గొన్న గురుస్వాములు మాట్లాడుతూ.. అన్నదాన కార్యక్రమం శ్రేష్ఠమైన సేవగా పేర్కొంటూ స్వామివారి అనుగ్రహంతో భిక్షా కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. తమ పాదయాత్ర శబరిమల వరకు సాఫల్యంగా సాగాలని, అందరి కుటుంబాలపై అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.అయ్యప్ప మాలధారణలో ఉన్న భక్తులు ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్తోత్రాలు పఠిస్తూ భక్తి వాతావరణాన్ని మరింతగా అలంకరించారు.