calender_icon.png 6 November, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం డివైఎఫ్ఐ నిరంతర పోరాటం

06-11-2025 05:43:25 PM

హనుమకొండ (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డివైఎఫ్ఐ అలుపెరగని పోరాటం చేస్తుందని డివైఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి డి.తిరుపతి అన్నారు. హనుమకొండలోని రాంనగర్ సుందరయ్య భవన్ లో డివైఎఫ్ఐ 46వ, ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా డివైఎఫ్ఐ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి లోకం, యువకులు ఎదుర్కొంటున్న సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ, దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా, యువజన ఉద్యమాల రథసారథిగా డివైఎఫ్ఐ ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా యువతను మోసం చేస్తున్నాయని, దేశంలో యువ శక్తి నిర్వీర్యం అయిపోతుందని, ఇలాంటి సందర్భంలో యువతను సక్రమమైన మార్గంలో నడిపేందుకు డివైఎఫ్ఐ నడుంబించిందని, దేశం కోసం సంఘం కోసం అనేక మంది డివైఎఫ్ఐ నాయకులు ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలతో డివైఎఫ్ఐ ఈరోజు దేశంలో అతిపెద్ద సంఘంగా ముందుకు పోతుందన్నారు.

దేశంలో యువజన సంఘాలను ముందుకు  నడిపించే రథసారధిగా డివైఎఫ్ఐ 1980లో పంజాబ్ లో ఏర్పడిందనీ నాటి నుంచి నేటి వరకు దేశ ఐక్యత కోసం పోరాటం చేస్తూ,విచ్ఛిన్నకర, ఏర్పాటు వాదులకు వ్యతిరేకంగా, మా దేహం మొక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అంటూ  దేశ సమగ్రత, ఐక్యత కోసం పని చేసిన సంఘం డివైఎఫ్ఐ అన్నారు. దేశంలో యువత ఎదుర్కొంటున్న సమస్యల పైన నిరంతరం  పోరాటాలకు సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు మంద సంపత్, ఇ.రవీందర్, డివైఎఫ్ఐ నాయకులు జంపాల రమేష్, ఎం సిద్ధార్థ్,ఎం.కావ్య, రాజేష్ ,ప్రజా సంఘాల నాయకులు జి.వెంకట్, కే. లింగయ్య, డి.భాను నాయక్, ఓ.సాంబయ్య, ఎం.మల్లేష్, కె. ఉపేందర్, మనోహర్,డి.నరేష్  తదితరులు పాల్గొన్నారు.