calender_icon.png 6 November, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి

06-11-2025 05:25:50 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని పోచారం గ్రామంలో రైతులు విధిగా తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని గోపాలమిత్రలు కల్లూరి రవీందర్, రాజిరెడ్డి కోరారు. గురువారం పోచారం గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు టీకాలను గ్రామ నాయకులతో కలిసి గోపాల మిత్రులు వేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆవులు 186, బర్రెలు 161, మొత్తం 347 పశువులకు గాలికుంటు టీకాలు వేశామని గోపాల మిత్రులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పశుపోషకులు తదితరులు పాల్గొన్నారు.