calender_icon.png 6 November, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

06-11-2025 05:27:43 PM

నకిరేకల్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజల కోసం లయన్స్ క్లబ్ లు చేపడుతున్న ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై. మోహన్ రెడ్డి కోరారు. గురువారం మండలంలోని నెల్లిబండ గ్రామంలో ఆ గ్రామానికి చెందిన యానాల శంకర్ రెడ్డి సహకారంతో నకిరేకల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 

శిబిరంలో 45 మందికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి 12 మందికి కంటి ఆపరేషన్లు చేయాలని గుర్తించగా 8 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తం రాగా వారిని సూర్యాపేట లయన్స్ కంటి ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు  రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన  ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు, కోశాధికారి అండం వెంకన్న,  క్లబ్ ప్రతినిధులు డి. సూర్య కుమార్, కందాల వేణుగోపాల్ రెడ్డి, వ్యాపారవేత్త మీలా సత్యనారాయణ, బిజెపి నాయకుడు యానాల శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట కంటి ఆసుపత్రి సిబ్బంది  స్వాతి,  చారి, గ్రామ కార్యదర్శి స్వాతి  తదితరులు పాల్గొన్నారు.