06-11-2025 05:21:51 PM
దర్యాపూర్ మోడల్ పాఠశాల్లో విద్యార్థులకు అవగాహనలో ఎస్ఐ రవికుమార్..
ముత్తారం (విజయక్రాంతి): సైబర్ నేరాల గురించి విద్యార్థులు తప్పక తెలుసుకోవాలని గురువారం దరియపూర్ మోడల్ పాఠశాల్లో ‘సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ముత్తారం ఎస్సై రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 9వ, 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, ఉపాధ్యాయులతో కలిసి ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ నేరాల గురించి విద్యార్థులకు సమగ్రంగా అవగాహన కల్పించారు. అలాగే విద్యార్థులకు భవిష్యత్‌లో ఉన్న కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహనతో పాటు తమ భవిష్యత్తు లక్ష్యాలపై స్పష్టత ఉండాలని, చదువుతో విద్యార్థుల భవిష్యత్తును మార్చుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.