calender_icon.png 14 May, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సంక్షేమంలో శాస్త్రవేత్తలు కీలకం

06-05-2025 12:00:00 AM

  1. రైతు ముంగిట శాస్త్రవేత్తలు 
  2. ఎమ్మెల్యే గడ్డం వినోద్

బెల్లంపల్లి అర్బన్, మే 5 (విజయ క్రాంతి) : బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమo నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. రైతులకు వ్యవసాయం, సాగు విధానాలపై ప్రధానంగా భూభారతి చట్టంపై అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమం రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. శాస్త్రవేత్తలు శాస్త్రీయమైన సలహాలు సూచనలతో రైతులకు వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు ను అందించాలన్నారు.

వ్యవసాయం, రైతు అభివృద్ధిలో శాస్త్రవేత్తల పాత్ర అత్యంత కీలకమైoదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసా య శాఖ జిల్లా అధికారి కల్పన, ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కెవికె ప్రోగ్రాం కోఆర్డినేటర్ శాస్త్రవేత్త కోట శివకృష్ణ మాజీ జెడ్పిటిసి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.