calender_icon.png 14 May, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వర్గానికి దిక్సూచి కార్ల్ మార్క్స్ సిద్ధాంతం..

06-05-2025 12:00:00 AM

  1. ఈ సిద్ధాంతం స్ఫూర్తితో మోదీ ప్రభుత్వ పెట్టుబడిదారీ దోపిడీ విధానాలను ఎండగడదాం..

ఏఐటీయూసీ రాష్ర్ట మాజీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ పిలుపు 

ఏఐటీయూసీ కార్యాలయంలో కార్ల్ మార్క్స్ 207వ జయంతి

ముషీరాబాద్, మే 5 (విజయక్రాంతి): కార్మిక వర్గం చైతన్యమై సమస్యల పరిష్కారానికి తిరుగుబాటు చేసినప్పుడే సోషలిజం స్థాపన, శ్రమదోపిడి లేని సమాజ స్థాపన సాధ్యం అవుతుందని ఏఐటీయూసీ రాష్ర్ట మాజీ ప్రధాన కార్యదర్శి, సీపీఐ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వీఎస్ బోస్ పిలుపుని చ్చారు.

హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూ సీ రాష్ర్ట కార్యాలయంలో సోమవారం కార్ల్ మార్క్స్ 207వ జయంతి కార్యక్రమం సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి, అభ్యుదయవాది అయినటువంటి కార్ల్  మార్క్స్ 1818 మే 5న జర్మనీలో జన్మించారని, అనేక ఆటుపోట్లు, కష్టనష్టాలను, అను భవించారని, పెట్టుబడిదారీ వ్యవస్థను ఏ విధంగా ఎదుర్కోవాలి,

శ్రామిక కార్మిక వర్గా న్ని ఏ విధంగా కాపాడుకోవాలని మార్క్స్ సిద్ధాంతం ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మార్క్స్ అని అన్నారు. ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలు సోషలిస్ట్, పార్టీలు ఈ సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయని వా టి మీదనే ఆధారపడి నడుస్తాయని మార్క్స్ సిద్ధాంతాన్ని మించింది ఇంకొకటి లేదన్నా రు. వారు చూపించిన బాటలో ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. 

కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు ద్వారాలు తెరిచి శ్రామికుల శ్రమను దోచి వారి గడియలను నిం పేందుకు కార్మిక చట్టాలను మార్చి యజమాని అనుకూల లేబర్ కోడ్లను తీసుకువ చ్చేందుకు ప్రయత్నిస్తున్నదని దానిని తిప్పికొట్టేందుకు ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ రాష్ర్ట ఉపాధ్యక్షురాలు పి ప్రేమ్ పావని ప్రసంగించగా ఏఐటీయూసీ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి వెంకటయ్య, డిప్యూటీ జనరల్ సెక్రటరీ బొడ్డుపల్లి కిషన్, కె రమేష్, పి రాజేష్, జి ధర్మపురి, పి కళ్యాణ్ బాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.