వీఆర్ కాలేజీని వెంటనే సీజ్ చేయండి
కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు
అబ్దుల్లాపూర్ మెట్, జూన్ 22: వీఆర్ జూనియర్ కాలేజీని వెంటనే సీజ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కే వై ప్రణయ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్ పేట్ లో గల వీఆర్ జూనియర్ కాలేజీ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే కాలేజీని నిర్వహిస్తున్నారని.. అట్టి కాలేజీ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
అనంతరం కే వై ప్రణయ్ మాట్లాడుతూ... ఈ సందర్భంగా ఎస్ ఎఫ్ ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కే వై ప్రణయ్ మాట్లాడుతూ... కాలేజీ నిర్వహణకు కావలసిన అనుమతులు లేకుండా కాలేజ్ ని నిర్వహిస్తున్నారని...ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బుక్స్ స్టేషనరీ అమ్ముతున్నారన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలు తప్పుదారి పట్టిస్తున్నారు. డీ ఐవో వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సమక్షంలో హామీ ఇచ్చారని తెలిపారు.
అనుమతులు లేని కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాలను ఉద్రిక్తం చేసి..కలెక్టర్ ఆఫీస్ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు గుండె శివకుమార్, శ్రీకాంత్, తరంగ్ సహాయ కార్యదర్శి తరంగ్, అరుణ్, శ్రీకాంత్, మెట్టు మండల కార్యదర్శి వంశీ తదితరులు పాల్గొన్నారు.






