ఇన్ -సర్వీస్ టీచర్లకు టెట్ వద్దు
23-06-2026 12:28 AM
ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలి: తపస్
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఇన్ -సర్వీస్ టీచర్లకు టెట్ నుం చి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర అధ్యక్షుడు వొద్నాల రాజశేఖర్, రా ష్ట్ర ప్రధానకార్యదర్శి తెల్కలపల్లి పెంట య్య డిమాండ్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకు వచ్చేలా జీరో అవర్, క్వశ్చన్ అవర్‌లో ప్రస్తావన చేసేలా దేశవ్యాప్తంగా 545 లోక్ సభ, 250 రాజ్య సభ సభ్యులను కలవనున్నట్లు తెలిపారు. తెలంగాణలోని ఎంపీలు, రాజ్యసభ సభ్యులను జూన్ 22 నుంచి జూలై 5 వరకు కలిసి సమస్య తీవ్రతను తెలిపేలా వినతిపత్రాలను సమర్పిస్తామన్నారు.






