calender_icon.png 30 January, 2026 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 56 శాతం బీ ఫారాలు ఇవ్వాలి

30-01-2026 02:21:31 AM

కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి 

బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ 

హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో జరిగే మున్సిపల్ ఎన్నిక ల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం 56 శాతం టికెట్లు కేటాయించాలని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాదులోని గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రె స్ పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో బీసీ ప్రతినిధుల బృందం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ బీసీ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మహేశ్‌కుమార్‌గౌడ్, మీనాక్షి నటరాజన్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కల్పించకపోతే పార్టీ పరంగా ఖచ్చితంగా కల్పిస్తా మని పదేపదే వెల్లడించిందన్నారు.

కానీ గ్రామపంచాయతీ ఎన్నికల్లోగానీ, మున్సిపల్ ఎన్నికల్లోగానీ పార్టీ పరంగా బీసీల జనాభా దామషా ప్రకా రం 56% శాతం టికెట్ల ఇవ్వడం మరిచిపోయారని చెప్పారు. పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే 56% బీ బీసీలకు ఇవ్వాలని, మున్సిపల్ చైర్మన్‌లలో కూడా 68 మున్సిపల్ చైర్మన్‌లుగా బీసీలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల కంటే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, అయినప్పటికీ బీసీలకు రాజకీయ అవకాశాలు పెంచడానికి పార్టీ పరంగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పార్టీలో అందరితో చర్చించి బీసీలకు రాజకీయంగా న్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ బేటిలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సం ఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, కో చైర్మన్ వీరస్వామి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రంగౌడ్, డాక్టర్ రమేష్, మాదేశి రాజేందర్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, సోమాచారి పాల్గొన్నారు.