14-11-2025 01:25:23 AM
- కేంద్ర,రాష్ట్ర నిధులు నిలిచిపోవడంతో తీవ్ర మనోవేదనలో పంచాయతీ కార్యదర్శులు
-స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాలు మరింత అస్తవ్యస్థం
ధర్మపురి, నవంబర్ 13 (విజయక్రాంతి) : గ్రామాల్లో పాలన కుంటుపడుతోంది. సర్పంచుల పదవీకాలం పూర్తు రెండేళ్లు దగ్గర పడుతున్నా నేటికి ఎన్నికలు జరగక పోవడంతో సమస్యల వలయంలో చిక్కుకున్నా యి. ప్రస్తుతం పాలనాధికారులుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు.. పనులు చేసేందుకు సతమతం అవుతున్నారు. అప్పులు తెచ్చి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు క ల్పించాల్సి వస్తుందని వాపోతున్నారు.
లక్షల్లో అప్పులు..ఉద్యోగుల తిప్పలు రెండేళ్లుగా సర్పంచ్ లు లేకపోవడంతో వెల్గటూర్ ఉ మ్మడి మండలంలోని పంచాయతీ కార్యదర్శిలు అప్పుల పాలవుతున్నారు. ఎన్నికల ని ర్వహణ ఆలస్యమైన కారణంగా ప్రత్యేక అధికారుల పాలన ఫిబ్రవరి 2024 నుండి కొ నసాగుతు వస్తుంది. ప్రత్యేక అధికారుల పాలనలో చిరు ఉద్యోగుల అయిన పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లో వివిధ పనుల నిర్వాహణకు లక్షల్లో ఖర్చులు చేస్తూ అప్పుల పాలవుతున్నారు.
గ్రామ పంచాయితీ పాలక వర్గాలు లేనందున కేంద్ర నిధులు కూడా ఆ గిపోయాయి. రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు కూడా నిలిచిపోవడముతో ఈ భారం మరిం త పెరిగింది. పేరుకు ప్రత్యేక అధికారుల పా లన అయినప్పటికీ స్థానికంగా ఉంటున్న పంచాయితీ కార్యదర్శుల మీదనే ఆర్ధిక భా రం పడుతుండము, పంచాయితీ కార్యదర్శులు గత 21 నెలలనుండి గ్రామ పంచా యతీల్లో విధి నిర్వహణలో ప్రజలకు తప్పనిసరిగా సేవలు అందించే క్రమంలో అప్పులు చేస్తూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన అయినప్పటికీ గ్రామాలకు ఖర్చు చేయడం సంగతి అంటుంచితే,కనీసం గ్రామాల వైపు ప్రత్యేక అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.గ్రా మాల్లో శానిటేషన్ పనుల నిర్వాహణకు రో జు గ్రామ పంచాయితీ ట్రాక్టర్ తిప్పడానికి నెలకు సుమారు 15 వేల వరకు ఖర్చు అవుతుంది. గ్రామ విస్తీర్ణం బట్టి పంచాయితీ తాగు నీటి సరఫరాలో భాగంగా పైప్ లైన్ ల రిపేరులు, మోటార్ ల రిపేరు లు, చేతి పం పుల రిపేర్ల కు వేల రుపాయలు పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేస్తున్నారు. వీది దీపాల నిర్వాహణ మరింత ఆర్ధిక భారం పడుతుంది.
కొన్నిచోట్ల గత పాలక మండలి లు ట్రాక్టర్ నిర్వాహణ పట్టించుకోక పోవటంతో ప్రత్యేక అధికారుల పాలన రాగానే అవి మొ రాయించడం కార్యదర్శులు పాలిట మరింత శాపంగా మారింది. వాటి సర్వీస్ రిపేరులకు సుమారు రూ. 20,000 లపైననే ఖర్చు అ వుతుంది. గ్రామాల్లో మంచి నీటి సరఫరా లో భాగంగా బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు, లైమ్ పౌడర్ కొనుగోళ్లకు ఆర్ధిక భారం పడుతుంది. సీజన్ ల వ్యాధుల నేపథ్యంలో ఉన్న తాధికారుల ఆదేశాలతో దోమల మందు స్ప్రే లు వంటి పనులు చేపట్టడం వల్ల కార్యదర్శులు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో కూ రుకుపోయినారు.
ప్రత్యక్ష అధికారుల పాలనలో తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మ కంగా భావించే దసరా పండుగలను రెండు సంవత్సరాలు నిర్వహించడంతో లక్షలాది రూపాయలు అప్పుచేసి మరీ క సమర్థవంతంగా దసరా వేడుకలను గతానికి ఏ మా త్రo తీసిపోకుండా నిర్వహించి సత్తా చాటా రు. చిన్న గ్రామ పంచాయితీ కార్యదర్శులు సుమారు మూడులక్షల వరకు అప్పుల్లో కూరుకుపోగా, పెద్ద గ్రామాల కార్యదర్శులు సుమారు ఏడులక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయారు. కొందరు కార్యదర్శిలు ఒకటికి మించి గ్రామాల్లో ఇంచార్జీ లు గా ఉండటం తో వారికి అదనపు ఖర్చులు అనుభవించాల్సి వస్తుంది.
గ్రామాల్లో అత్యవసర పను లు చేయకుంటే ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారన్న భయంతో,గ్రామాల్లో స్థా నిక ప్రజల ఒత్తిడితో తప్పనిసరి ఖర్చుచేయా ల్సి రావడంతో పంచాయతీ కార్యదర్శులు తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు. ప్ర భుత్వాలు ఇప్పటికైనా సరిపడా నిధులు గ్రా మ పంచాయతీలకు విడుదల చేసి పంచాయతీ కార్యదర్శులను ఆదుకోవాలని, గ్రా మాల్లో పూర్వవైభవం తీసుకురావాలని ఆ యా గ్రామాల్లోని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.