calender_icon.png 3 August, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వక్ఫ్’ చట్ట సవరణతో ఆస్తుల భద్రత

29-07-2025 12:00:00 AM

చలాది పూర్ణచంద్రరావు :

వక్ఫ్ అంటే.. ఇస్లాం మతం అనుసరించేవారు దానం చేసిన ఆస్తి అని అర్థం. ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా కేటాయించే చట్టమే వక్ఫ్ చట్టం. ఇది ఇస్లాంలో ఒక రకమైన ధార్మిక సంబంధిత చర్య. ప్రభుత్వం ఒక్కసారి ఒక ఆస్తిని ఒకసారి వక్ఫ్‌గా ప్రకటిస్తే, ఇక దానికి చట్టపరంగా ఎదురు ఉండదు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఉంది.

2014 సార్వత్రిక ఎన్నికల ముందు ఢిల్లీ మహానగరంలో అత్యంత సంపన్న ప్రాంతమైన లుటినెన్స్ జోన్‌లోని ఈ 123 ఆస్తులనూ వక్ఫ్ బోర్డు పరం చేసేందుకు యూపీఏ ప్రభుత్వం రహస్యంగా ఆమోదముద్ర  వేసింది. ఇదే ఏడాది మార్చి 5న గెజిట్ నోటిఫికేషన్ సైతం జారీ అయింది. దీంతో ఢిల్లీలోని ‘ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫీస్’ పరిధిలోని 61 ఆస్తులు, ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన 62 ఆస్తులూ వక్ఫ్ బోర్డుపరమయ్యాయి.

గెజిట్ వచ్చిన కొన్ని గంటల్లోనే ఎన్నికల ప్రకటన వెలువడింది. ఫలితంగా అదేరోజు నుంచి దేశమంతటా ఎన్నికల నియమావ ళి అమలులోకి వచ్చింది. దీన్నిబట్టి యూపీఏ ప్రభుత్వం కేవలం ముస్లింల ఓట్ల కోసం ముందస్తు ప్లాన్‌తో ఆ వక్ఫ్‌బోర్డుకు ఆస్తులను అప్పగించిందని మనం అర్థం చేసుకోవాలి. వక్ఫ్ అంటే ఇస్లాం మతం అనుసరించేవారు దానం చేసిన ఆస్తి అని అర్థం.

ఇస్లామిక్ చట్టం ప్రకారం మతపరమైన లేదా స్వచ్ఛంద ప్రయోజనా ల కోసం ప్రత్యేకంగా కేటాయించే చట్టమే వక్ఫ్ చట్టం. ఇది ఇస్లాంలో ఒక రకమైన ధార్మిక సంబంధిత చర్య. ప్రభుత్వం ఒక్కసారి ఒక ఆస్తిని ఒకసారి వక్ఫ్‌గా ప్రకటిస్తే, ఇక దానికి చట్టపరంగా ఎదురు ఉండదు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు ప్రతి రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఉంది.

అపరిమిత అధికారాలు..

వక్ఫ్ చట్టం 1954లో మొదటిసారి ప్రభుత్వ ఆమోదం పొందింది. 1995లో వక్ఫ్ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ బోర్డుకు అపరిమిత అధికారాల కల్పన జరిగింది. 2013లో మళ్లీ వక్ఫ్ చట్ట సవరణ జరిగిం ది. ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని, ఎవ రి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్ బోర్డులకు అపరిమిత హక్కులు అదనంగా వచ్చాయి. సరళంగా చెప్పాలంటే.. ముస్లిం ఛారిటీ పేరుతో ఆస్తిని క్లెయిమ్ చేయడానికి వక్ఫ్ బోర్డుకు అపరిమిత హక్కులు వచ్చాయన్న మాట.

ఏ ఆస్తినైనా వక్ఫ్ బోర్డు తమదని అనుకుంటే.. ఆ ఆస్తికి సంబంధించిన యజమానికి కోర్టుకు వెళ్లినా లాభం ఉండదిక. ఎందుకంటే వక్ఫ్ బోర్డు విషయంలో కోర్టు జోక్యం చేసుకోకుండా ప్రత్యేక చట్టం ఉంది. ఫలితంగా ఈ చట్టం ద్వారా సంక్రమించిన అధికారంతో కొందరు రాజకీయ నాయకులు విలువైన భూములను దోచుకున్నారు. ప్రస్తుతం దేశం లో 30 వక్ఫ్ బోర్డుల వరకు ఉన్నా యి.

ఆ బోర్డులు ఇప్పటివరకు ప్రైవేటు, ప్రభుత్వ  ఆస్తులు, దేవాలయాల భూములను ఆక్రమించాయనే ఆరోపణలు ఉన్నా యి. ఆ మధ్య తమిళనాడు వక్ఫ్ బోర్డు తాజాగా ఒక గ్రామంలోని భూమంతే తమదేనని ప్రకటించడం గ్రామస్థులను దిగ్భ్రాంతికి గురి చేసింది. గ్రామంలో 1,500 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన హిందూ ఆలయం కూడా ఉంది. నిన్నమొన్న ఏర్పడిన ఒక మత బోర్డు 1,500 ఏళ్ల నాటి ఆలయాన్ని స్వాధీనం కోసం ప్రయత్నం చేయడం దారుణం కాక మరేమిటి.

ప్రధాని నరేంద్ర మోదీ వీటన్నింటిపై దృష్టి సారించారు. ఈ ఏడాదిలో వక్ఫ్ చట్టంలో మార్పులు చేయాలని సంకల్పించారు. సవరణలు చేసి వక్ఫ్ బోర్డును సవరించారు. దీంతో ఆస్తులకు భద్రత వచ్చింది. అలాగే ముస్లిం సమాజానికీ పారదర్శకమైన సామాజిక, -ఆర్థిక న్యాయం అందించినట్లయింది. గతంలో వక్ఫ్ బోర్డులో పారదర్శకత లేని కారణంగా దేశవ్యాప్తంగా 21 వేలకు పైగా ఆస్తికి సంబంధించిన కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయనేది గణంకాలు చెప్తున్నాయి.

వాస్తవానికి వక్ఫ్ అనేది అస్తుల నిర్వహణ, పాలన బాధ్యతలు మాత్రమే నిర్వహించే వ్యవస్థ అయినప్పటి కీ, సుదీర్ఘ కాలంగా దాన్ని ఒక మతపరమైన సంస్థగానే అది కొనసాగుతూ వస్తు న్నది. వక్ఫ్ పరంగా ఉన్న సమస్యలపై కేంద్రం దృష్టి సారించి, ఏప్రిల్ 23న వక్ఫ్ చట్టం సవరణ బిల్లు తీసుకువచ్చింది. బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదంతో పాటు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పడింది. దీంతో దశాబ్దాల నుంచి ఏ కోర్ట్ కూడా పరిష్కరించలేని సమస్యలకు పరిష్కారం చూపించినట్లయింది.

254 ఆస్తులు తనవిగా ప్రకటన..

వక్ఫ్ బిల్లు సవరణ బిల్లుకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగక మానదు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ పెద్దలు వక్ఫ్‌కి అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారు. వక్ఫ్ బోర్డు కొన్ని ఆస్తులను తన ఆస్తులుగా ప్రకటించుకున్నది. వివాదం చివరకు సుప్రీం కోర్టుకు చేరింది. షాజహాన్ తరపున సంతకాలు చేసిన పక్షం వారు అందుకు తగిన  డాక్యుమెంట్లు సమర్పించాలని బోర్డును ఆదేశించింది.

అలాంటివేమీ లేకపోవడంతో బోర్డు వాదనను కొట్టివేసింది. ఇంకా వక్ఫ్ ప్రకటించుకున్న ఆస్తుల్లో ఢిల్లీలో 72 , కర్ణాటకలో 59, గుజరాత్‌లో 57, ఉత్తర ప్రదేశ్ లో 37, మహారాష్ట్రలో 14 , హర్యానాలో 5, జమ్మూకశ్మీర్ లో 3 రాజస్థాన్ లో 4, మధ్య ప్రదేశ్‌లో ఒకటి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఒకటి, బీహార్‌లో ఒకటి.. ఇలా దేశవ్యాప్తంగా మొత్తం 254 ఆస్తులను తనవిగా ఏక పక్షంగా ప్రకటించుకున్నది.

మిగిలిన రాష్ట్రాల్లోని ఆస్తుల సంగతి అలా ఉంచితే.. ఒక్క తెలంగాణలో రూ.66 వేల కోట్ల విలువ చేసే 1,700 ఎకరాల భూమిని వక్ఫ్ తనదిగా ప్రకటిం చుకుంది. అలాగే  కర్ణాటకలోని దత్తపీఠం ఆలయం పైన కూడా వక్ఫ్ బోర్డు తన హక్కు ప్రకటించుకుంది. 

గత సంవత్సరం 2024 సెప్టెంబర్ నాటి గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 5,973 ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ బోర్డు తన ఆస్తులుగా ప్రకటించుకున్నది. అలాగే జాతీయ స్థాయిలోని 32 వక్ఫ్ బోర్డులు తమ అధీనంలోని 8.72 లక్షల ఆస్తులతో పాటు 38 లక్షల ఎకరాల భూములు తమ ఆధీనంలో ఉన్నట్లు ప్రకటించుకున్నాయి. ఇంత దారుణమైన వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు ఎన్డీఏ ప్రభుత్వం పూనుకున్నది.

ప్రత్యేక చొరవతో చట్ట సవరణ చేసింది. తద్వారా చట్టం కోరలు పీకేసినట్లుయిందని పలువురు ముస్లిం నేతలు సహా ఇతర వర్గాల బాధితులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రధాని మోదీ చొరవ ప్రస్తుత తరమే కాదు, ముందు తరాలకు మేలు చేసినట్లయింది. ఒక్క చట్ట సవరణ దేశవ్యాప్తంగా ఉన్న వందల వేల సమస్యలకు పరిష్కారం చూపింది.