29-07-2025 12:00:00 AM
డాక్టర్ ఎస్ విజయభాస్కర్ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల (బీసీ)కు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఆ సంకల్పం అభినందించదగినది. బీసీలు ఎక్కువ మంది చట్టసభల్లోకి రావాలని సర్కార్ కోరుకుంటున్నది. ఈ సందర్భంలో ప్రభుత్వం అస లు ఇప్పటివరకు చట్టసభల్లో అడుగుపెట్టలేని సామాజికవర్గాలను గుర్తించాలి. కుల వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారంలో నిలదొక్కుకోలేని కలాలను గుర్తించాలి.
అలాం టి కులాల్లో ఆరె కటికలు కూడా ఉన్నారని పరిగణించాలి. వారిని కేవలం ఓటర్లు గానే, జనాభాను చూసే పద్ధతికి స్వస్తి పలకాలి. తెలంగాణలో ఆరె కటికెలు వెనుక బడిన కులాలు (బీసీ) జాబితాలో ‘డి’ గ్రూప్, క్రమ సంఖ్య ‘2’లో ఉన్నారు. ఈ సామాజికవర్గం ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడే ఉంది. రాష్ట్రంలో వీరి జనాభా సుమారు 15 లక్షలు.
ఇంత పెద్ద సామాజికవర్గ అభివృద్ధిపై అటు అధికార పక్ష నాయకులు, ఇటు ప్రతిపక్ష నాయకులు దృష్టి సారించడం లేదు. వారికి దమాషా ప్రకారం అందాల్సిన ఫలాలను అందించడం లేదు. రాజకీయాల్లో ప్రధాన పదవులను పక్కన పెడితే, కనీసం నామినేటెడ్ పదవులైనా కట్టబెట్టడం లేదు. ఆరె కటికెలను ఇప్పుడు సామాన్య భాషలో కటిక, ఆరె సూర్యవంశీ, సారోళ్లు, కలాల్, మరాఠీలు అని పిలుస్తున్నారు.
కచ్చితంగా ఆరె కటికలు అనేది పిలవకపోవడంతో జనాభా లెక్కల కోసం ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లు ఎవరు ఏ పేరు చెబితే ఆ పేరే రాసుకుంటున్నారు. దీని వల్ల ఆరె కటికెల జనాభా తెలుసుకోవడంలో ఇబ్బం దులు ఎదురవుతున్నాయి.ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఆరె కటికెలు 60, 70 వేలకు మించి లేరని చెప్పారు.
అది నిజం కాదు. అమాత్రం జనాభా ఒక్క హైదరాబాద్‌లోని జియగూ డ, బేగంబజార్‌లోనే ఉంటుంది. మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఏ ఒక్క ప్రాంతం తీసుకున్న లక్షకు పైగానే జనాభా ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 దాటినా, తెలంగాణ ప్రత్యేక సిద్ధించినా చట్ట సభల్లో ఆరె కటికలు ప్రవేశానికి నోచుకోలేదు.
కార్యకర్తలుగానే చూస్తున్నరు..
రాజకీయ పార్టీలన్నీ ఆరె కటికలను కార్యకర్తలుగా, ఓటర్లుగానే చూస్తున్నాయి తప్ప, వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడం లేదు. వారికి రాజకీయ రంగంలో ప్రవేశం లేక దశాబ్దాల నుంచి పదవులకు దూరంగానే ఉంటున్నా రు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 150 కార్పొరేటర్లలో ఒక్కరూ కూడా ఆరె కటికెలు లేరంటే, ఆ సామాజికవర్గానికి అధికార, ప్రతిపక్ష నాయకులు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఆరె కటికల ప్రధానమైన వృత్తి మాంసం విక్రయించడం. రెండు దశాబ్దాల క్రితమైతే ప్రభుత్వ సారాయి అమ్మడం. ప్రభుత్వం గతంలో దుబార, రాశి అంటూ సారాయి అమ్మేది. ఆ పని ప్రభుత్వం కేవలం ఆరె కటికెలకు మాత్రమే కేటాయించింది. రాను రాను దుబారా, రాశి నిషేధానికి గురికావడంతో మద్యం దుకాణాల సంస్కృతి వచ్చింది.
వైన్స్ వేలాల్లో లక్షలు గుమ్మరించాల్సి రావడంతో వెనుకబడిన కులాలకు చెందిన వారు, వేలాల్లో పాల్గొనేందుకు ఎక్కువ అవకాశం లేదు. వేలాలను ఎక్కువగా ఆధిపత్య కులాలే దక్కించుకుంటున్నాయి. బీసీ లు వాటిని దక్కించుకోవడం చాలా తక్కు వ. ఇక ఆరె కటికలు వైన్ షాపులు దక్కించుకోవడం అంత సులభమైన పని కాదు. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలకు అలాంటివి కేవలం కలగానే మిగిలిపోతాయనడంలో ఆశ్చర్యమేమీ లేదు.
కబేళాలు నిర్మించాలి..
ఆరె కటికలకు ఒకప్పుడు కురుమ, యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు జీవాలు సమకూర్చేవారు. అలా రెండు మూడు సామాజికవర్గాలు కలిసి కట్టుగా ఉండి, ఒకరికొకరు ఉపాధి ఇచ్చుకుంటూ ఉండేవారు. ముస్లీం మతస్థులు కూడా ఈ సహాయ, సహకారాల్లో భాగస్వామ్యం ఉండేది. మొదట్లో వారు మేక, గొర్రె, పొట్టేలు కోసిన తర్వాత ఆరె కటికలు కేవలం మాంసం మాత్రమే విక్రయించేవారు.
రానురాను ఆరె కటికలు కూడా మాంసం విక్రయాలకు సంబంధించిన అన్ని పనులు నేర్చుకున్నారు. తొలిరోజు ల్లో ఆరె కటికలు కత్తిపడతారే తప్ప, ఏ జంతువు ప్రాణం తీయరు. వేరెవరో ప్రాణం తీసిన జీవి చర్మాన్ని వలిచి ఆ కళేబరాన్ని శుభ్రపరిచి అమ్ముతారు. వీరు మూల పురుషులు.. సూర్యవంశ క్షత్రియ కులస్తులు. వీరిని ఉత్తరాదిలో మహరాజ్ ఖాట్వాంగ్ పేరుతో, లేదంటే ఖాటిక్‌గా పిలుస్తారు.
కటికలకు ఛత్రపతి శివాజీ సైన్యంలో ముందుండి పోరాడి, ప్రాణాలు అర్పించిన చరిత్ర ఉంది. మొఘలుల అకృత్యాలు ఎక్కువ అవ్వటంతో వారు దక్షి ణాదిగా వలస వచ్చారు. ఇక్కడ మాంసం విక్రయాలు మొదలుపెట్టారు. జంట నగరాల్లోని జియగూడ, గౌలిపురా, బోయి గూడ, కాచిగూడ కబేళాలు మాంసానికి ఎంతో ప్రసిద్ధి. జంట నగరాల్లో ఎక్కడ శుభ, అశుభ కార్యాలు జరిగినా, నిర్వాహకులు ఆయా కబేళాల నుంచే మాంసం తీసుకెళ్లేవారు.
అయితే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి పాలకులు కాలుష్యం చూపి జంట నగరాల్లో కబేళాలను మూసివేయాలనే కుట్రపన్నారు. అది అమలు చేశారు కూడా. ఆ చర్య ఫలితంగా వందలాది ఆరె కటికె కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్రత్యే క రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్లీ కబేళాలకు అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆరె కటికెలు కబేళాల్లో మాంసం విక్రయిస్తున్నారు.
మున్సిపాలీలకు పన్నులు కూడా చెల్లిస్తున్నారు. గౌలిపురా, జియగూడలో ఆధునిక కబేళాల నిర్మాణానికి కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా, ప్రభుత్వం కబేళాలు నిర్మించకపోవడంపై ఆరె కటికల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇకనైనా కబేళాల నిర్మాణం చేపట్ట కపోతే ఉద్యమ బాట పట్టేందుకు ఆరె కటికలు సిద్ధమవతున్నారు. గౌలిపురా కబేళా లో ఇప్పటికే ఆధునిక యంత్రాలు, సరంజామా వచ్చినప్పటికీ, ఆ కబేళా ప్రారం భోత్సవానికి నోచుకోవడం లేదు.
దేశంలో ని 18 రాష్ట్రాల్లో ఆరె కటకెలు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఉదాహరణకు.. ఉత్తరప్ర దేశ్, హర్యానా, జమ్మూకశ్మీర్, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలల్లో ఎస్సీ జాబితాలో ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీl -డీలోనే కొనసాగుతున్నా రు.
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వీరు బీసీ జాబితాలో ఉన్నారు. తమ సామాజికవర్గంలో ఉన్న పేదిరకం, వెనుకబాటుతనాన్ని చూసి ప్రభుత్వం తమను ముందు బీసీ ఏ జాబితాలో చేర్చాలని, ఆ తర్వాత ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆరె కటికలు కోరుతున్నారు. తద్వారా ఒకే దేశం, ఒకే రిజర్వేషన్ అనే రాజ్యాంగ స్ఫూర్తి నిలబడుతుందని భావిస్తున్నారు.
ఆత్మగౌరవ భవనం అప్పగించాలి..
గత ప్రభుత్వం వెనుకబడిన కులాలకు ఉప్పల్, కోకాపేట్‌లో కేటాయించిన ఆత్మగౌరవ భవనాలు కట్టించింది. దీంతో ఆరె కటిక సామాజిక వర్గానికి చెందిన కొంద రు తమ సామాజిక వర్గానికి కూడా ఆత్మగౌరవ భవనం నిర్మించాలని కోరారు. కానీ, ఐక్యత లేకపోవడం, ‘మా సామాజికవర్గ సంఘానికి మేం రాష్ట్ర అధ్యక్షుల మంటే, మేమే రాష్ట్ర అధ్యక్షులమని’ చాటుకోవడంతో నాటి ప్రభుత్వ పెద్దలు అంతా కలిసి ట్రస్ట్‌గా ఏర్పడాలని సూచించారు.
అలా చేస్తే కోకాపేట్‌లో ఆరె కటికెల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఎకరా భూమి తో కోటి రూపాయలు ఇస్తామన్నారు. దీంతో ఆరె కటికల్లో 13, 14 గ్రూపునకు చెందిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు కలిసి ఒక ట్రస్ట్‌గా ఏర్పడ్డారు. తర్వాత ప్రభుత్వం మారింది. ప్రస్తుత ప్రభుత్వం వెనుకబడిన కులాల ఆత్మగౌరవ భవనాన్ని ఆరె కటిక ట్రస్ట్‌కు అప్పగించాలనే డిమాం డ్ ఇప్పుడు మొదలైంది. ప్రభుత్వం ఆరె కటికెలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని ఆ సామాజిక వర్గం కోరుతున్నది.
ఆరె కటికల ప్రధానమైన వృత్తి మాం సం విక్రయించడం.. కాబట్టి సర్కార్ వారి కోసం అన్ని జిల్లాల్లో ఆధుని క కబేళాలు నిర్మించాలి. ఈ సామాజికవర్గానికి చెందిన జనాభా ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం చొరవ తీసుకుని ఆరె కటికెల అభ్యున్నతి కోసం కృషి చేయాలి. చట్టసభల్లో ఆరె కటికలకు అవకాశాలు కల్పించాలి.