calender_icon.png 9 September, 2025 | 10:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురక్ష సేవలు అభినందనీయం

01-09-2025 01:21:26 AM

 అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ అశోక్‌రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 31: సురక్ష సేవా సంఘం సేవలు అభినందనీయమని అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ డబుల్ బెడ్రూం డిగ్నిటీ కాలనీలో ఏర్పాటు సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ వి. అశోక్‌రెడ్డి హాజరై ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సభలో వి. అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా 100 మందితో సమానమన్నారు. అలాగే నేర నియంత్రణ, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల వినియోగంపైన అవగాహన కల్పించారు. సీపీ కెమెరాలను ఏర్పాటు చేసిన సురక్ష సేవా సంఘం సేవలను అభినందించారు.

కాలనీ వాసులు మాట్లా డుతూ... కాలనీ ప్రారంభమైనప్పటి నుంచి మాకు అనేక విధాలుగా తోడ్పటునిచ్చిన సురక్షసేవా సంఘం అధ్యక్షులు గోపిశంకర్ యాదవ్ మా పాలిట దేవుడని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో ఎస్‌ఐ మాధవరావు, జీహెచ్‌ఎంసీ వర్క్ ఇన్‌స్పెక్టర్ సాధిక్, సురక్ష సేవా సంఘం క్రియాశీల సభ్యులు, డబుల్ బెడ్రూం డిగ్నిటీ కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.