01-09-2025 01:24:19 AM
-సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ
ముషీరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుద ర్శన్ రెడ్డిపై నక్సలైట్ సానుభూతి పరుడిగా ముద్రవేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్ పేరుతో సుదర్శన్ రెడ్డిని చంపుతారేమో అన్న అనుమా నం కలుగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశా రు.
క్రిమినల్ నేరస్తుడుగా ఉన్న అమిత్ షా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నా రు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ ల యుద్ధభేరి సభ ముగిసిన తర్వాత మీడియాతో నారాయణ మాట్లాడారు. అసెంబ్లీ లో బీసీల 42 శాతం రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం చేయడం మంచి పరిణామని అన్నారు. లోపల కొంతమందికి ఇష్టం లేకపోయినా బహిరంగంగా మద్దతు తెలిపారని పేర్కొన్నారు.
కానీ పవర్ ఫుల్ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పరిపాలన చేసిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మద్దతు ఇస్తే బాగుండేదన్నారు. ఇంత మంచి చట్టం చేసినప్పుడు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్‌లో ఉండ టం సరికాదన్నారు. తక్షణమే ఆయన ఎమ్మె ల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాం డ్ చేశారు. తెలంగాణ పోరాటానికి మద్దతు ఇచ్చిన తెలంగాణ బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి మద్దతుపై కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.