04-05-2025 12:43:05 AM
అభినందనలు చెప్పిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఖైరతాబాద్, మే 3: బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు 102/1 సర్వేనెంబర్‌లో ఉన్న ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయింది. విషయం తెలుసుకున్న కలెక్టర్‌అనుదీప్ దురిశెట్టి, ఆర్డీవో, ఎమ్మార్వో, అధికారులు రికార్డుల ఆధారంగా తిరిగి రెవెన్యూ అధీనంలోకి తీసుకున్నారు.
శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆ స్థలాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచ నలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కోట్లు విలువ చేసే భూ మిని కబ్జా నుంచి విడిపించిన అధికారులను అభినందించారు. ఈ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా సీఎం నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలో భూములకు రక్షణ దొ రుకుతుందని తెలిపారు. రాష్ట్రం లో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.