calender_icon.png 7 May, 2025 | 10:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ మహా సభలకు తరలి రావాలి!

04-05-2025 12:47:27 AM

తెలుగు ప్రజలను కోరిన కేంద్రమంత్రి పెమ్మసాని 

గుంటూరు, మే 3: వచ్చే సంవత్సరం జనవరి 3, 4, 5 తేదీల్లో జరగబోయే 3 వ ప్రపం చ తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మ సాని చంద్రశేఖర్ కోరారు.

ఆంధ్ర  సారస్వత పరిషత్తు ఆంధ్ర మేవ జయతే! నినాదం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గుంటూరు, అమరావతిలో నిర్వహిస్తుండటం అందరకీ గర్వకా రణం అని అన్నారు. శనివారం భారతీయ విద్యా భవన్, గుంటూరు ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహా సభల ప్రచార పత్రికను ఆయన విడుదల చేసి, మాట్లాడారు. తాను నేను తెలుగు మాద్యమంలో విద్యాభ్యాసం చేశానని గుర్తుచేశారు.

గుంటూరు శ్రీ సత్యసాయి స్పిరిచువల్  సిటీ ప్రాంగణం 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు వేదిక కావడం తమకు ఎంతో ఆనందంగా ఉన్నద ని శ్రీ సత్యసాయి విద్యాసంస్థల చైర్మన్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నందమూరి  తారక రామారావు వేదికపై ఆంధ్ర సాంస్కృతిక, సాహితీ వైభవాన్ని, తెలుగు భాషా వెలుగులను దశ దిశలా ప్రసరింపజేసేదిశగా సభలు నిర్వహిస్తామన్నారు. ముఖ్య సమన్వయకర్త పి రామచంద్రరాజు వందన సమర్ప ణ చేశారు. ఈ సభలో కార్యదర్శి ధవేజి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ చౌదరి, సహా సమన్వయకర్త విద్యాసాగర్ పాల్గొన్నారు.