calender_icon.png 7 May, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హరిరాం కేసులో దర్యాప్తు ముమ్మరం

04-05-2025 12:40:54 AM

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ భూక్యా హరిరాం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు మమ్మరం చేసింది. శుక్రవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి హరిరాంను ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకుని, సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో ప్రశ్నించారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం హరిరాం ఆస్తులు రూ.13 కోట్లుగా గుర్తించగా.. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ పదిరెట్లని అంచనా. ఈ లెక్కన వంద కోట్లకు పైగా హరిరాం ఆస్తులను ఏసీబీ గుర్తించింది. హరిరాంకు చెందిన లాకర్లను తెరిస్తే ఆస్తుల విలువ భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను రాబడుతున్నట్టు సమాచారం.