19-01-2026 01:13:37 AM
ఘట్ కేసర్, జనవరి 18 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్ పరిధి అంకుశాపూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల సైనిక కళాశాలలో ఇంటర్మీ డియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జి. సృజన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక అయ్యింది.
గత సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ నుండి 12 వరకు మహబూబాబాద్ లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ మహబూబాబాద్ టోర్నమెంట్ లో రాష్ట్ర స్థాయి లెవెల్ లో సృజన ఎంపిక కావడం జరిగింది. ఈనెల 19వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్న జాతీయ స్థాయి పోటీలకు హిమాచల్ ప్రదేశ్ కి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. గురుకుల పాఠశాల నుండి నేషనల్ లెవెల్ ఆటల పోటీలకు ఎంపికైనందుకు విద్యార్థిని సృజనను, కళాశాల పిఈటి నవనీతను కళాశాల ప్రిన్సిపాల్ జూపల్లి రేణుక అభినందించారు.